: 30 లక్షలకు కుచ్చుటోపీ
ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించిన ఓ వ్యక్తి 30 లక్షలతో ఉడాయించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పాన్ గల్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన శివయ్యచారి బీసీ వెల్ఫేర్ స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని కొందరు నిరుద్యోగులను నమ్మించాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 4 లక్షల చొప్పున వసూలు చేశాడు. ఇటీవల నియామక పత్రాలను కూడా ఇచ్చాడు. అందులో ఉన్న చిరునామాను వెతుక్కుంటూ వెళ్లిన యువకులకు అసలు విషయం తెలిసింది. తాము మోసపోయామని, తమకు ఇచ్చినవి నకీలీ నియామక పత్రాలని గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.