: అరచేతిలో స్వర్గం చూపినా బాబు అధికారంలోకి రాలేరు: గండ్ర
ప్రజలకు ఎన్ని హామీలిచ్చినా వారు తెలుగుదేశం అధినేత చంద్రబాబును నమ్మరని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అరచేతిలో స్వర్గం చూపినా బాబుకు అధికారం దక్కదని ఎద్దేవా చేశారు. ఇక పాదయాత్ర సందర్భంగా బాబు గుప్పిస్తున్న హామీలు వాస్తవ రూపం దాల్చాలంటే, దేశ బడ్జెట్ చాలదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.