: వైఎస్సార్సీపీకి సమైక్య రాష్ట్ర ఉద్దేశం లేదు: టీడీపీ


రాజీనామాలు చేస్తామని, అసెంబ్లీని సమావేశ పర్చాలని స్పీకర్ ను వైఎస్సార్సీపీ నేతలు కలవటం.. ఇవన్నీ ఆ పార్టీ నాటకాలేనంటోంది టీడీపీ. అసలు వారిలో సమైక్యాంధ్ర సాధించాలన్న ఉద్దేశమే లేదని ఆ పార్టీనేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల సూచనలతోనే రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని విమర్శించారు. 2000 సంవత్సరంలోనే విభజన చిచ్చు పెట్టిన కాంగ్రెస్.. ఈ విషయాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టింది కూడా ఆ పార్టీయే కదా? అన్నారు. రోశయ్య కమిటీని ఏర్పాటు చేసిందీ ఆ పార్టీ ముఖ్యమంత్రే కదా? అని ప్రశ్నించారు. చిన్న చిన్న కేసుల్లో పట్టుబడిన ఉద్యోగులకే బెయిల్ రావడం కష్టంగా ఉంటే.. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ కు బెయిలు ఎలా వచ్చిందని ముద్దుకృష్ణమ నిలదీశారు. జగన్ కు బెయిల్ వచ్చిన రోజు రూ.1200 కోట్లు బెంగళూరులో విత్ డ్రా అయ్యాయని ఆరోపించిన ఆయన, ఆ భారీ మొత్తాన్ని సోనియాకు ఇచ్చారో, మరెవరికో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్ బీఐ నిగ్గు తేల్చాలన్నారు.

  • Loading...

More Telugu News