: సీబీఐ అధికారి చంద్రశేఖర్ పై కేసు పెట్టాలి: పయ్యావుల
జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ అక్రమాలు జరిగాయని చెప్పిందని, మరి ఇప్పుడు క్విడ్ ప్రో-కో లేదని ఎలా చెప్పిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సీబీఐని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ జరిపిన సీబీఐ అధికారి చంద్రశేఖర్ పై కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. హడావుడిగా జగన్ కేసుపై విచారణ పూర్తి చేయడంపై పలు రకాల అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. జగన్ తో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఒప్పందాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని, ఈ ఒప్పందం వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతుందని పయ్యావుల ఆవేదన వ్యక్తం చేశారు.