: బస్సు లోయలో పడి 19 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో బస్సు లోయలో పడిన ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రన్సువా - జోబ్రాగ్ గ్రామాల మధ్య ప్రయాణిస్తున్న బస్సు 600 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే 18 మంది చనిపోయారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, గవర్నర్ సంతాపం తెలియజేశారు.