: పార్టీకి కట్టుబడినవారే నేతలవుతారు: డీఎస్
విభజనపై అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పందించారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటేనే నేతలవుతారన్నారు. మ్యాచ్ ముగిసిపోయిందని.. విభజన జరిగిందని.. ఆడటానికి బాల్స్ లేవని వ్యాఖ్యానించారు. ఆట ముగిసిందని తన అల్లుడు శ్రీధర్ బాబు స్పష్టంగా చెప్పాడన్న డీఎస్, వ్యవస్ధను చెడగొట్టాలని చూస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ అంశంపై చంద్రబాబు యూ-టర్నో.. క్యూ-టర్నో తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ రోజుకో రకంగా మాట్లాడుతోందని డీఎస్ పేర్కొన్నారు.