: డీజీపీ పిటిషన్ పై క్యాట్ లో వాదనలు ప్రారంభం
డీజీపీ దినేష్ రెడ్డి పిటిషన్ పై క్యాట్ లో వాదనలు మొదలయ్యాయి. పదవీకాలాన్ని పొడిగించడం కుదరదంటూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాట్ కు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీజీపీ మళ్లీ క్యాట్ లో పిటిషన్ వేశారు. ఈ నెలతో ఆయన పదవీకాలం ముగియనుంది. మరోవైపు ప్రభుత్వం కొత్త పోలీస్ బాస్ కోసం అప్పుడే పరిశీలనలు మొదలుపెట్టింది.