: నేడు ఒబామాతో మన్మోహన్ సమావేశం
రెండురోజుల అధికారిక అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ గత రాత్రి వాషింగ్టన్ చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ అమెరికా అధ్యక్షుడితో శ్వేతసౌధంలో ఈ రోజు సమావేశం కానున్నారు. రక్షణ, ఆర్థిక, ప్రాంతీయ సమస్యలపై ఇరు దేశాల నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. మన్మోహన్ వెంట ఆయన భార్య గురుశరణ్ కౌర్, జాతీయ భద్రతాసలహాదారు శివశంకర్ మీనన్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ లు ఉన్నారు. కాగా భారత్, అమెరికా సంబంధాల బలోపేతానికి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని అమెరికా సెనేట్ భారత ప్రధానిని అభినందించింది. ఆయన అమెరికా పర్యటనను స్వాగతిస్తూ ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది.