: ప్లాస్టిక్‌తో ఇలా కూడా చేయవచ్చట!!


పర్యావరణానికి ప్లాస్టిక్‌ సంచులు చాలా హాని చేస్తాయని, వాటి వాడకాన్ని ఎంత తక్కువ చేస్తే మనకు, మన ముందు తరాలవారికి అంత మంచిదని అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా మనం వాటిని వాడకుండా ఉండలేకున్నాం. ఇకపై ఇలాంటి ప్లాస్టిక్‌ సంచులు వాడినా ఫరవాలేదు. ఎందుకంటే వాటిని తిరిగి ఉపయోగించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరిజ్ఞానంతో పర్యావరణ ప్రమాదకర ప్లాస్టిక్‌ సంచులను ఉపయోగించి కార్బన్‌ నానో ట్యూబులను తయారుచేశారు.

ఇప్పటి వరకూ ప్లాస్టిక్‌ సంచులు భూమిలో కలిసిపోకుండా, పర్యావరణానికి చాలా హాని చేస్తాయని, అలాగే నీటిలో పడడం వల్ల నీటిని కలుషితం చేస్తాయని మనందరికీ తెలిసిందే. ఇలాంటి ప్లాస్టిక్‌ సంచులను ప్రకృతిహితమైన పదార్ధంగా మార్చే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆస్ట్రేలియాకు చెందిన అడిలైడ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరిజ్ఞానంతో ప్లాస్టిక్‌ సంచులను కర్బన సూక్ష్మ తొడుగులు (కార్బన్‌ నానో ట్యూబ్స్‌) తయారీకి అవసరమయ్యే ముడిపదార్ధంగా మార్చవచ్చని చెబుతున్నారు. ఇందుకుగాను రీ సైక్లింగ్‌ నానో టెక్నాలజీ ప్రక్రియను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్రక్రియద్వారా తయారుచేసిన పదార్ధం ఇనుముకంటే వందరెట్లు ఎక్కువ దృఢంగా ఉండడంతోబాటు బరువు కూడా చాలా తక్కువగా ఉంటుందంటున్నారు.

  • Loading...

More Telugu News