: డీజీపీ పిటిషన్ పై క్యాట్ లో ముగిసిన విచారణ
పదవీకాలాన్ని పొడిగించాలంటూ డీజీపీ దినేశ్ రెడ్డి క్యాట్ లో పెట్టుకున్న అభ్యర్ధన పిటిషన్ పై విచారణ ముగిసింది. ఆయన పిటిషన్ ను తోసిపుచ్చిన ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించలేమని స్పష్టం చేసింది. అధిక ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజీపీపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పొడిగింపు అవసరంలేదని ప్రభుత్వం క్యాట్ కు నివేదిక ఇచ్చింది.