: సమైక్యానికి మద్దతుగా 5 వేల మంది జలదీక్ష


సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు జిల్లాలో ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తుమ్మల పెంట సముద్ర తీరంలో ఐదువేల మంది సమైక్యవాదులు జలదీక్ష చేపట్టారు.

నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖర రాజు మృతికి సంతాపంగా జిల్లావ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఏపీఎన్జీవోలు వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలను మూయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మార్కెట్ యార్డు వద్ద ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. నిమ్మకాయల లోడుతో వచ్చిన వందలాది వాహనాలను అడ్డుకున్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యవాదులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించి ఆందోళన చేశారు. మున్సిపల్ ఉద్యోగులు వాటర్ ట్యాంకర్లతో నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News