: 350కి చేరిన పాకిస్థాన్ భూకంప మృతుల సంఖ్య


పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ రాష్ట్రంలో సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య 350కి చేరింది. భూకంప తీవ్రతతో పోర్ట్ ఆఫ్ గ్వాదార్ తీరంలో ద్వీపం లాంటి ప్రదేశం ఏర్పడిందని అక్కడి స్థానికులు తెలిపారు. 200మీటర్ల పొడవు, 328మీటర్ల వెడల్పుతో ఈ ద్వీపం ఏర్పడినట్టు వారు తెలిపారు. దీన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. మంగళవారం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదయిన సంగతి తెలిసిందే. బెలూచిస్థాన్ లోని అవారన్ కేంద్రంగా ఈ భూకంపం ఏర్పడినట్టు అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

  • Loading...

More Telugu News