: మీ ఏకాగ్రత తగ్గితే నేనూ తగ్గుతా...


'మీ ఏకాగ్రత తగ్గితే నేను వెళ్లే వేగం కూడా తగ్గుతాను' అన్నట్టుగా మీ దృష్టి డ్రైవింగ్‌నుండి పక్కకు మళ్లితే, దాని వేగాన్ని తనకు తానుగా తగ్గించుకునే కొత్త రకం కారు వస్తోంది. ఈ కారు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు.

సహజంగా వాహనాలను నడిపేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వెంటనే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి వీటి ఫలితం కొన్ని జీవితాలను కోల్పోవాల్సి ఉంటుంది. అలాకాకుండా మీ ఏకాగ్రత ఏమాత్రం తగ్గిందని తెలిసినా వెంటనే మీరు నడిపే కారు దానికదే వేగం తగ్గిపోతే... అప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయికదా. ఇలాంటి సరికొత్త కారును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన రాయల్‌ ఆటోమొబైల్‌ క్లబ్‌కు చెందిన నిపుణులు మన ఏకాగ్రతను అనుసరించి ముందుకు సాగే కారును తయారుచేశారు.

ఈ కారు న్యూరో హెడ్‌సెట్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఈ న్యూరోహెడ్‌సెట్‌ను డ్రైవరు తలకు తగిలిస్తారు. ఈ హెడ్‌సెట్‌ మెదడులోని చర్యలను గుర్తిస్తుంది. డ్రైవరు డ్రైవింగ్‌పై ఏకాగ్రత చూపనపుడు కారు వేగం ఆటోమేటిక్‌గా తగ్గిపోయేలా ఇందులో ప్రోగ్రాంను అభివృద్ధి చేశారు. కారు నడిపే సమయంలో మనకు కొంతసేపటికి ఏకాగ్రత తగ్గడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో కారు వేగం తగ్గడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయికదా...!

  • Loading...

More Telugu News