: జగన్ బెయిల్ ను కాంగ్రెస్ తో ముడిపెట్టడం హాస్యాస్పదం: తులసిరెడ్డి
కాంగ్రెస్ అండదండలు, అనుమతితోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిందంటూ బీజేపీ, టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ నేత తులసీరెడ్డి ఖండించారు. జగన్ బెయిల్ ను కాంగ్రెస్ తో ముడిపెట్టడం అత్యంత హాస్యాస్పదమన్నారు. ఈ విషయంలో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని పేర్కొన్నారు. బెయిల్ ఇవ్వడమనేది న్యాయవ్యవస్థ ప్రక్రియలో ఒక దశ మాత్రమేనన్న తులసీరెడ్డి, బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసు కొట్టివేసినట్లు కాదన్నారు. ఈ మాత్రానికే వైఎస్సార్సీపీ నేతలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.