: నిషేధంపై కోర్టులోనే తేల్చుకుంటాం: లలిత్ మోడీ న్యాయవాది
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీపై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారని క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా మోడీపై వేటు వేశారు. అయితే, దీనిపై కోర్టులోనే తేల్చుకుంటామని మోడీ న్యాయవాది మహమూద్ అబిద్ తెలిపారు. మోడీపై ఈర్ష్యతోనే ఆయనకు బీసీసీఐ నుంచి శాశ్వతంగా ఉద్వాసన పలికారని అబిద్ ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. కొందరి స్వార్థప్రయోజనాల కారణంగా చెన్నైలో జరిగిన బీసీసీఐ సర్వ సభ్య సమావేశంలో మోడీపై జీవితకాల నిషేధం నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.