: బ్రూమ్ విశ్వరూపం.. చరిత్ర సృష్టించిన ఒటాగో వోల్ట్స్
ఒటాగో వోల్ట్స్ జట్టు చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు పుటల్లోకెక్కింది. పెర్త్ స్కార్చర్స్ తో జైపూర్లో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒటాగో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 242 పరుగులు చేసింది. చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఈ రికార్డు ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉంది. 2011లో భారత్ గడ్డపైనే జరిగిన టోర్నీలో బెంగళూరు జట్టు సదరన్ ఆస్ట్రేలియా జట్టుపై 215 పరుగులు చేసింది. ఒటాగో జట్టు అదిరిపోయే బ్యాటింగ్ ప్రదర్శనతో బెంగళూరు రికార్డు తెరమరుగైంది.
నేటి మ్యాచ్ విషయానికొస్తే.. ఒటాగో ఓపెనర్ నీల్ బ్రూమ్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 56 బంతుల్లో అజేయంగా 117 పరుగులు చేశాడు. బ్రూమ్ స్కోరులో 9 ఫోర్లు, 8 సిక్సులున్నాయి. బ్రూమ్ కు తోడు టెన్ డష్కాటె (66), డెరెక్ (45) కూడా బ్యాట్ ఝుళిపించడంతో ఒటాగో రికార్డు స్కోరు సాధించింది.