: సమోసాలు తిని ఆసుపత్రిపాలయ్యారు
ఓ దుకాణంలో సమోసాలు కొనుక్కుని తిన్న 27 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లాలోని భత్కరీ గ్రామంలో జరిగింది. సమోసాలు తిన్న వెంటనే వీరంతా అనారోగ్యానికి గురి కావడంతో... వెంటనే వారిని దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీళ్లంతా సమోసాలు తిన్నందువల్లే అనారోగ్యానికి గురయ్యారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఓహ్రి తెలిపారు. ఇవి రెండు మూడు రోజుల కిందట చేసిన సమోసాలు అయ్యుంటాయని... అందుకే వీరు అనారోగ్యం పాలయ్యారని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమోసా శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపారు. దుకాణదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సమోసాలు తిన్న 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉంది.