: కేవలం ప్రభుత్వ ఉద్యోగులే ఉద్యమం చేస్తే ఏం లాభం..!: దిగ్విజయ్


సీమాంధ్రలో గత యాభై ఆరు రోజులుగా కొనసాగుతున్న ఉద్యమంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ప్రైవేటు సంస్థలన్నీ పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం చేసి ఏం లాభమని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలన్నింటినీ కచ్చితంగా పరిశీలిస్తామన్నారు. అధినేత్రి సోనియాగాంధీతో ఈ రోజు భేటీ అయిన అనంతరం మీడియాతో దిగ్విజయ్ మాట్లాడుతూ.. తెలంగాణపై హోంశాఖ ముసాయిదా తయారుచేస్తోందని ఆయన చెప్పారు. కేబినెట్ నోట్ తయారైన తర్వాత అసెంబ్లీకి పంపిస్తామన్నారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయవద్దని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇక జగన్ బెయిల్ పై కాంగ్రెస్, వైఎస్సార్సీపీ లాలూచీ పడ్డాయన్న టీడీపీ వ్యాఖ్యలను దిగ్విజయ్ ఖండించారు.

  • Loading...

More Telugu News