: ఏపీఎన్జీవోల చలో అసెంబ్లీ రద్దు
మార్చి 13న ఏపీఎన్జీవోలు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం రద్దయింది. ఎన్జీవోల ప్రధాన డిమాండ్ అయిన పదో వేతన సంఘం నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో హర్షం వ్యక్తం చేసిన ఏపీఎన్జీవోలు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. వేతన సంఘం నియామకంపై ఏపీఎన్జీవోలు ఈ రోజు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.