: నోయిడాలో మరోసారి ఫార్ములా వన్ రేసు


వచ్చే నెల 25 నుంచి 27 వరకు నోయిడాలోని బుద్ధ సర్క్యూట్ లో ఫార్ములా వన్ రేసు జరగనుంది. ఈ రేసు విజయవంతం కావడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని యూపీ ప్రభుత్వం తెలిపింది. భద్రతా కారణాల రీత్యా రేసింగ్ ఈవెంట్ ను నాలుగు జోన్లుగా విభజించారు. ఇదే సర్క్యూట్ లో 2011లో తొలిసారిగా ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ జరిగింది. ఈ రేసును తిలకించడానికి ప్రపంచవ్యాప్తంగా 65 వేల మంది అభిమానులు హాజరు కావచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు ఈ ఈవెంట్ కు సినీతారలు,ఇతర సెలబ్రిటీలు తరలిరానున్నారు.

  • Loading...

More Telugu News