: జిహ్వచాపల్యాన్ని చంపుకోవడమా?.. నావల్ల కాదు: బ్రిట్నీ స్పియర్స్
జిహ్వచాపల్యాన్ని చంపుకోవడం తన వల్ల కావడంలేదని ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ వాపోతోంది. డిసెంబర్ లో లాస్ వెగాస్ లో ఆమె ప్రదర్శన ఇవ్వనున్న సందర్భంగా ఫిట్ నెస్ కాపాడుకోవాల్సిందిగా నిర్వాహకులు, ట్రైనర్లు ఆమెను ఒత్తిడి చేస్తున్నారు. అన్ని ఫిట్ నెస్ సూత్రాలను శ్రద్ధగా పాటిస్తున్న బ్రిట్నీ జిహ్వచాపల్యాన్ని మాత్రం అదుపు చేసుకోలేకపోతోంది. స్వతహాగా భోజన ప్రియురాలైన బ్రిట్నీ మాత్రం రోజుకు 'ఆరు' సార్లే భోజనం చేసి సరిపెట్టుకుంటోందట! దీంతో కాస్త బొద్దుగా మారింది. గతంలో డ్రగ్ అడిక్ట్ గా మారిన బ్రిట్నీ ఇప్పుడు కోలుకుని భోజన ప్రియురాలైంది. దాని కంటే ఇదే మంచిదని బ్రిట్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.