: మాత్రలు వికటించి 177మంది చిన్నారులకు అస్వస్థత
ఒడిశాలోని పూరీ జిల్లాలో ఐరన్ మాత్రలు వికటించి 177 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కడుపునోప్పితో బాధపడుతున్నారు. చికిత్స కోసం పూరీలోని ఓ ఆసుపత్రికి పంపినట్లు జిల్లా కలెక్టర్ నబ కుమార్ తెలిపారు. స్థానిక వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చిలిక, నూపాడ గ్రామాల్లోని పాఠశాలల్లో దాదాపు మూడు వందలమంది పిల్లలకు ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. వాటివల్లే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని తెలిసిన కలెక్టర్ ఇతర పాఠశాలల్లో పంపిణీ నిలిపివేశారు. అటు, ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జిల్లా కలెక్టర్ ను వివరణ కోరారు.