: నేడు భోపాల్ లో పర్యటించనున్న మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పర్యటించనున్నారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో భోపాల్ చేరుకుంటారు. రానున్న శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇక్కడి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మోడీ సభకు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. అయితే, మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం... ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీ తొలిసారి మోడీతో వేదిక పంచుకునే అవకాశాలున్నట్టు సమాచారం. ఇదే జరిగితే బీజేపీకి మరింత ఊపు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో మోడీ ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహించారు.