: పాకిస్తాన్ లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.8గా నమోదైంది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. కాగా, ఈ భూకంపం కారణంగా మనదేశంలోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ 15 సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ళలోంచి బయటకు పరుగులు తీశారు.