: రేపు ఢిల్లీకి సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు


రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. సచివాలయ ప్రాంగణంలో బైఠాయించిన ఉద్యోగులు విభజన ప్రకటన వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగులు రేపు ఢిల్లీ బయల్దేరనున్నారని చెప్పారు. ఈ నెల 26న కొవ్వొత్తుల ప్రదర్శన, 27న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతామని తెలిపారు. నాలుగు రోజుల పాటు ఢిల్లీలో విభజనకు వ్యతిరేకంగా రకరకాల నిరసనలు తెలుపుతామని పేర్కొన్నారు. అనంతరం 30న హైదరాబాదుకు చేరుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News