: ఎంపీలకు స్పీకర్ ఝలక్
రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలనుకున్న సీమాంధ్ర ఎంపీలకు స్పీకర్ మీరా కుమార్ ఝలక్ ఇచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన స్పీకర్... హఠాత్తుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని పాట్నా పర్యటనకు వెళ్లారు. ఈ విషయం తెలియని ఎంపీలు షెడ్యూలు ప్రకారం స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. దీంతో, మేడం టూర్ వెళ్లిన సంగతి స్పీకర్ కార్యాలయం అధికారులు ఎంపీలకు తెలియజేశారు. ఈ నెల 30 న స్పీకర్ ను కలవొచ్చని వారు తెలిపారు. దీంతో కంగుతిన్న ఎంపీలు ఏం చేయాలో తెలియక స్పీకర్ కార్యాలయం వద్దే వేచియున్నారు.