: కాసేపట్లో జగన్ విడుదల
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ జగన్ కాసేపట్లో విడుదల కానున్నారు. జామీను పత్రాలను కోర్టులో సమర్పించేందుకు ఆయన తరపు లాయర్లు సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఇద్దరు వ్యక్తులు రూ. 2 లక్షల చొప్పున పూచీకత్తు ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి, యశ్వంత్ పూచీకత్తు సమర్పించారు. జామీను పత్రాలను పరిశీలించిన అనంతరం జగన్ విడుదలకు కోర్టు అనుమతినిస్తుంది. మొత్తం ప్రక్రియ పూర్తికావడానికి మరో రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.