: మలాలాకు క్లింటన్ పురస్కారం
పాకిస్థాన్ లో తాలిబన్లను సైతం ఎదిరించి బాలికల విద్యపై గొంతెత్తిన చిన్నారి మలాలా యూసుఫ్ జాయ్ కు 'క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్' పురస్కారం దక్కింది. మలాలాతో పాటు భారతీయ పర్యావరణవేత్త బంకర్ రాయ్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూయార్క్ లో రేపు జరగనున్న 'క్లింటన్ గ్లోబల్ ఇనీషియేటివ్' స్వచ్ఛంద సంస్థ వార్షిక సమావేశంలో వీరిద్దరూ అవార్డులను స్వీకరించనున్నారు. భారత్ కు చెందిన రాయ్ ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు.