: చంచల్ గూడ వద్ద భారీ బందోబస్తు
జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బెయిల్ పై విడుదల కానుండటంతో... చంచల్ గూడ జైలు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్ ను చూసేందుకు జైలు వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు వస్తుండటంతో... అక్కడ మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒక కంపెనీ బీఎస్ఎఫ్, మూడు ఏపీఎస్పీ ప్లాటూన్లతో పాటు సౌత్ జోన్ లోని 17 పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని అక్కడ మోహరింపచేశారు. ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు.