: మాటకు మూలం ఇదే!


మాట రావడానికి మూలమేది...? దీనికి కారణం ఏమై ఉంటుంది... అనే విషయంపై పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలకు చివరికి భూమిపై పుట్టిన ప్రాణుల్లో మనిషి మాత్రమే మాట్లాడడానికి కారణమైన అంశాన్ని గుర్తించారు. ఈ కారణం వల్లనే మనిషి మాట్లాడగలడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనిషిలోని ఒక రకమైన మానసిక సామర్ధ్యం కారణంగానే మనిషి మాటలు నేర్వగలిగాడని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు.

సృష్టిలో ఇన్ని జీవరాశులు ఉండగా... మనిషి మాత్రమే చక్కటి భాషను నేర్వడానికి కారణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దర్హాం విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో మనిషి ఒకరకమైన మానసిక సామర్ధ్యాన్ని ప్రత్యేకంగా సంతరించుకోవడం వల్లనే మనిషిలో భాషా నైపుణ్యానికి కారణమని తేల్చారు. ఇందుకుగాను వారు ఒక గణిత మోడల్‌ను ఉపయోగించి అధ్యయనం సాగించారు. మనిషిలో మానసికంగా కొన్ని రకాల సంకేతాల సమ్మేళనమే ఇందుకు కారణమని, ఇందులో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంకేతాలు కలగలిసి మనిషిలో భాష ద్వారా భావ వ్యక్తీకరణకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కారణంగానే ఇతర ఎలాంటి జీవుల్లోను మనిషిలో ఉండే ఇలాంటి సామర్ధ్యాలు ఉండవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News