: జగన్ అరెస్టు, బెయిల్ తో కాంగ్రెస్ కు సంబంధం లేదన్న బొత్స
జగన్ అరెస్టు, బెయిల్ తో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కాంగ్రెస్, వైకాపా కుమ్మక్కయ్యాయని చంద్రబాబు అనడం సరికాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఎప్పుడూ ఏమి చేయలేదని, సిద్ధాంతాలకు అనుగుణంగానే పార్టీ నడుచుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ తో ఎవరు కలుస్తామన్నా కలుపుకు పోతామని తెలిపారు.