: మొబైల్ ఫోన్లు, సిగరెట్ల ధరలకు రెక్కలు


పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం 18శాతం ఎక్సైజ్ పన్ను వేశారు. అంటే సిగరెట్లు, గుట్కాలు, ఖైనీలు తదితర ఉత్పత్తుల రేట్లు పెరిగిపోవడం ఖాయం. 
2వేల రూపాయలకు పైగా ఖరీదు చేసే మొబైల్ ఫోన్లపై 6శాతం పన్ను వేశారు. వీటి ధరలు అంతశాతం పెరిగిపోతాయి. 
దిగుమతి చేసుకునే సెట్ టాప్ బాక్సులపై పన్నును 5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు.  
మార్బుల్ రాళ్లపై కూడా సుంకాన్ని పెంచారు.
విలాసవంతమైన కార్ల దిగుమతిపై 100శాతం పన్ను పెంచారు. 
800సీసీ బైకులపై కూడా దిగుమతి సుంకాన్ని 75శాతం చేశారు. 
ఇక సినిమా రంగానికి సేవాపన్ను నుంచి మినహాయింపు కల్పించారు. కాటన్ వస్ర్తాలు, పాదరక్షలపై కూడా పన్ను తగ్గించారు. 

  • Loading...

More Telugu News