: ఆ ఇద్దరు ముష్కరులు ఖతం.. బందీలు విడుదల
కెన్యా రాజధాని నైరోబీలో షాపింగ్ మాల్ పై విరుచుకుపడి దొరికినవారిని దొరికినట్టు కాల్చిచంపిన ముష్కరులిద్దర్నీ భద్రతాదళాలు కాల్చిచంపాయి. అనంతరం ఉగ్రవాదుల దగ్గర బందీలుగా ఉన్న అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నైరోబీలోని వెస్ట్ గేట్ షాపింగ్ మాల్ పై ఆదివారం సోమాలియాకు చెందిన ఉగ్రవాదులు జరిపిన దాడిలో 62 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.