: జగన్ కు బెయిల్ తో సంబరాల్లో వైఎస్సార్సీపీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో పండగ వాతావరణం వెల్లివిరిసింది. ఆ పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని ఆనందంతో నృత్యాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాలు సంబరాల్లో మునిగిపోయాయి. తమ అధినేతకు బెయిల్ లభించడంతో తమ పార్టీ ప్రజల్లోకి మరింతగా వెళ్ళగలుగుతుందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.