: జగన్ కు బెయిల్ మంజూరు


జగన్ కు బెయిల్ మంజూరైంది. 484 రోజుల పాటు జైలులో ఉన్న జగన్ కు నాంపల్లి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారని, అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని జగన్ పై పలు అభియోగాలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. దీనిపై సుదీర్ఘకాలం దర్యాప్తు చేసిన జగన్ క్విడ్ ప్రో-కో కు పాల్పడ్డారనేందుకు తగిన ఆధారాలు లేవని తెలిపింది. దీంతో, 2012 మే 27న అరెస్టైన జగన్మోహన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఆయన బెయిల్ కోసం రెండు లక్షల రూపాయల చొప్పున పూచీకత్తుతో ఇద్దరు వ్యక్తులు ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇక, బెయిల్ రావడంతో.. 16 నెలల పాటు సుదీర్ఘంగా జైలు జీవితాన్ని అనుభవించిన జగన్ లాంఛనాలు ముగించి స్వేచ్ఛగా విడుదల కానున్నారు.

  • Loading...

More Telugu News