: లగడపాటి ఇంటిని ముట్టడించిన విశాలాంధ్ర సభ్యులు


హైదరాబాదులోని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటిని విశాలాంధ్ర మహాసభ సభ్యులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నినదిస్తూ జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి ప్రదర్శనగా వచ్చారు. రాష్ట్ర విభజన ప్రకటనకు నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియలో జాప్యానికి కారణం.. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలేనని, రాజకీయ నాయకులు కాదని స్పష్టం చేశారు. సీమాంధ్రకు చెందిన నాయకులందరూ తమ పదవులకు రాజీనామా చేయకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News