: రెచ్చిపోయిన పవన్ అభిమానులు
పవన్ కల్యాణ్ అభిమానులు రెచ్చిపోయారు. సినిమా రిలీజ్ కాకముందే పైరసీ సీడీలు మార్కెట్ లో లభ్యమవడంపై ఆగ్రహించిన పవర్ స్టార్ అభిమానులు బెజవాడలో వీరవిహారం చేశారు. విజయవాడలో ఓ సీడీ షాపుపై దాడి చేశారు. సీడీలను స్వాధీనం చేసుకుని కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను ధ్వంసం చేశారు. తమ అభిమాన హీరో సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని, అయితే సినిమా విడుదలకు ముందే పైరసీకి గురికావడం తమను షాక్ కు గురి చేసిందన్నారు. పవన్ ను అణగదొక్కేందుకే కొంతమంది కుట్రపన్ని ఇలా పైరసీ సీడీలని విడుదల చేశారని వారు ఆరోపించారు. అయితే, పవర్ స్టార్ ను ఎవరూ అణగదొక్కలేరని నినాదాలు చేశారు.