: మత్తుమందిచ్చి నర్సుపై అత్యాచారం
ఓ నర్సుకు మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని కేంద్రపర పట్టణ శివారు ప్రాంతంలోని గారాపూర్ లో.. ఆహార పదార్థం మీద మత్తుమందు చల్లి, తినిపించి, తరువాత అత్యాచారానికి పాల్పడి దానిని సెల్ ఫోన్ లో చిత్రీకరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు శివప్రసాద్ ఆచార్య(52) అనే వ్యక్తి ఆమె పొరుగునే ఉంటాడు. జరిగిన ఘటనపై ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ఆచార్యను అత్యాచారం, మహిళల పట్ల అసభ్యప్రవర్తన సెక్షన్ల కింద అరెస్టు చేశారు. కోర్టు బెయిల్ తిరస్కరించడంతో అతడిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు.