: ఇస్లాం సంబంధిత ప్రశ్నకు జవాబివ్వలేదని భారతీయుడ్ని కాల్చేశారు


కెన్యాలోని నైరోబీలోని షాపింగ్ మాల్ లో జరిగిన మారణకాండలో భారతీయుల మరణం వెనుక కారణాలు తెలిశాయి. జాషువా హకీం అనే ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాల ప్రకారం షాపింగ్ మాల్ కు కొంత మంది టీనేజర్లు, మరి కొంత మంది సాయుధులు వచ్చి ఏకే47 అసాల్ట్ రైఫిల్స్ తో ఇష్టారాజ్యంగా కాల్పులు ప్రారంభించారు. అంతకుముందు ముస్లింలు ఎవరో తెలుసుకునేందుకు వారు స్వాహిలి భాషలో మాట్లాడి సమాధానాలు ఇచ్చిన వారిని వదిలేశారు. హకీం తన ఐడీ మీదున్న జాషువా పేరును చేతితో మూసేసి హకీం పేరు మాత్రమే కనపడేట్టు చూపడంతో వెళ్ళిపొమ్మన్నారు. అతని తరువాత వరుసలో ఉన్న భారతీయుడ్ని మహమ్మద్ తల్లి పేరేంటని అడిగారని అతను సమాధానం చెప్పలేకపోవడంతో అతడ్ని కాల్చి చంపేశారని హకీం వెల్లడించాడు.

  • Loading...

More Telugu News