: నెల్లూరు జిల్లాలో రూ.30 లక్షల విలువైన ఎర్ర చందనం పట్టివేత


నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం కండలేరు జలాశయం సమీపంలో రూ. 30 లక్షల విలువ చేసే ఎర్ర చందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం హర్యానా రాష్ట్రానికి చెందిన లారీలో 6 టన్నులకు పైగా బరువున్న 80 ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్న సమయంలో అటవీ శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. డీఎఫ్ఓ హుస్సేనీ సూచనల మేరకు రేంజి అధికారి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం అక్రమ రవాణాకు ఉపయోగించిన లారీని అటవీశాఖ ఠాణాకు తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News