: మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి: షిండే
గత మూడేళ్లలో మహిళలపై దాడులు పెరిగాయని కేంద్ర హోం శాఖ మంత్రి షిండే తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో షిండే ప్రసంగించారు. మహిళల రక్షణ, భద్రత అజెండాగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. దేశాభివృద్ధిలో వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీలను పురోగతిలో భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉందని షిండే అన్నారు.