: కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ కలిసి నాటకాలాడుతున్నాయి: సోమిరెడ్డి
కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నేతల సతీమణులు రాష్ట్రపతిని కలవడం ద్వారా ఆ రెండు పార్టీలు ఒక్కటే అనడానికి నిదర్శనమని అన్నారు. సోమయాజులు, ఉదయభానుల సతీమణులు భర్తలకు తెలియకుండానే రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్ నేతల భార్యలతో కలసి వెళ్లారా? అని ప్రశ్నించారు. దీనిపై ఆ రెండు పార్టీలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.