: తెలంగాణ భాషపై భయంకరదాడి జరిగింది: కేసీఆర్


తెలంగాణ భాషను ఇప్పటికీ కించపరుస్తూనే ఉన్నారని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ఆరోపించారు. కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ భాషపై భయంకర దాడి జరిగిందని వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో 'తెలంగాణ జాగృతి' ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అక్టోబర్ 2 నుంచి 14 వరకు 'బంగారు బతుకమ్మ' పేరిట ఉత్సవాలు చేపట్టనుండగా.. వాటికి సంబంధించిన పోస్టర్, సీడీలను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో భిన్న మాండలికాలు, భిన్నయాసలు ఉంటాయని వివరించారు. అంతెందుకు, ఒక జిల్లాలోనే పంటలు, వృత్తులు వేర్వేరుగా ఉంటాయని పేర్కొన్నారు.

తెలంగాణలోని భాష తురకం కలిసిన తెలుగని కొందరు సీమాంధ్ర కవులు అన్నారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలోని అన్ని మారుమూల ప్రాంతాల ప్రజల వ్యవహారికంలో ఉర్దూ కలగలసిపోయిందని చెప్పుకొచ్చారు. జైలు, ఖైదీ, పరారీ.. ఇవన్నీ ఉర్దూ పదాలే అని ఇవి సీమాంధ్రలోనూ వాడుకలో ఉన్నాయని తెలిపారు. ఒక భాషలోని పదాలు యాదృచ్చికంగా ఇతర భాషల్లో కలిసిపోతుంటాయని, అలాగే తెలంగాణ భాషలో ఉర్దూ పదాలు కాస్త ఎక్కువగా కలిశాయని వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News