: మోడీ సభకు రజనీకాంత్ మద్దతిస్తారా?


దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ కొన్ని రోజులుగా జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీయే ఆయనను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారంటూ పుకార్లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చేవారంలో తమిళనాడులోని తిరుచ్చిలో భారీ సభ నిర్వహించనున్నారు. దీనికి రజనీకాంత్ మద్దతిస్తే బాగుంటుందని, వీలైతే ఆయనచేత ప్రచారం చేయించుకోవాలని బీజేపీ భావిస్తోంది. తమిళ అభిమానుల్లో రజనీకి ఉన్న అపార అభిమానం, పేరు, ప్రఖ్యాతులను కొంతైనా ఉపయోగించుకోవాలని తలపోస్తున్నారు. ఇందుకు రజనీని ఒప్పించాలని స్థానిక బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News