: 20కి చేరిన కోల్ కతా అగ్నిప్రమాద మృతుల సంఖ్య
కోల్ కతాలోని ఓ మార్కెట్లో ఈ ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 20కి చేరింది. ఇక్కడి సూర్యసేన్ మార్కెట్లో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగడంతో తప్పించుకునే వీలులేక పలువురు అక్కడిక్కకడే చనిపోయారు. కొందరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సాయంత్రం సంఘటన స్థలాన్ని పరిశీలించారు.