: అంబానీకి ఉగ్రవాదుల బెదిరింపు లేఖ!


రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ఇటీవలే ఉగ్రవాదుల పేరిట ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఇండియన్ ముజాహిదిన్ సంస్థకు చెందినవాడిగా భావిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ లేఖను రిలయన్స్ సిబ్బందికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ లేఖలో, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని అంబానీ పట్ల బెదిరింపులకు పాల్పడ్డారు.

అంతేగాకుండా, ముఖేష్ ఎంతో ముచ్చటపడి కట్టుకున్న 27 అంతస్తుల అత్యంత అధునాతన భవంతి 'ఆంటిలా'ను కూల్చివేస్తామని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్టు ముంబయి పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News