: జగన్ కేసును నీరుగారుస్తున్నారు: సోమిరెడ్డి


భారత దేశ చరిత్రలోనే సంచలనం సృష్టించిన జగన్ అక్రమాస్తుల కేసును ఎందుకు నీరుగారుస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీబీఐ దాఖలు చేసిన 12 ఛార్జిషీట్ల లోనూ పొట్లూరు వరప్రసాద్ పేరు ఎందుకు ప్రస్తావించలేదని అడిగారు. '200 కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టు సీబీఐ కేసు దాఖలు చేసింది. కానీ ఆ కుంభకోణంలో జగన్ సంస్థలు 400 కోట్ల రూపాయలు లాభపడ్డాయని తెలిపారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ మూడు చార్జిషీట్లు దాఖలు చేసి మంత్రులను కాపాడాలనే నెపంతో కేసును ఎందుకు నీరుగారుస్తున్నా'రన్నారు.

ప్రభుత్వ ఉదాసీనత వల్ల పీవీపీ వెంచర్స్ జగన్ సంస్థల్లో 400 కోట్ల రూపాలు పెట్టుబడి పెట్టిందని వెల్లడించారు. సండూర్ పవర్ ప్రాజెక్టు మీద ప్రభుత్వం ఎందుకంత ప్రేమ చూపిస్తోందని ఆయన ప్రశ్నించారు. సరస్వతీ పవర్ ప్రాజెక్టు కోసం నిబంధనలు తుంగలో తొక్కి, అక్రమాలకు పాల్పడితే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వేల కోట్ల అక్రమాలు జరిగినా ఎలా కొనసాగనిస్తున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం పేదోడికో న్యాయం, పెద్దోడికో న్యాయం అమలు చేస్తోందని సోమిరెడ్డి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News