: రాజకీయాల్లోకి రజనీకాంత్..?
తన తర్వాత, తన ముందు వచ్చిన తారల్లో చాలామంది రాజకీయాల్లో ప్రవేశించినవారే. కానీ, అరవై ఏళ్ళు దాటినా ఈ తమిళ సూపర్ స్టార్ మాత్రం ఇప్పటికీ సినిమాల్లోనే కొనసాగుతున్నాడు. ఆయనే రజనీకాంత్! దేశదేశాల్లో పాప్యులారిటీ ఉన్న రజనీకాంత్ ఏనాడు రాజకియాల గురించి నోరు విప్పలేదు. కానీ, ఈయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారంటూ కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నారు. అదీ, బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ప్రోత్సాహమేనని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికీ మంచి సంబంధాలు ఉన్నాయట. అందుకే రజనీని బీజేపీలో చేర్చుకుని రాజకీయ ప్రవేశం చేయించాలనుకుంటున్నట్లు వినికిడి.
ఇన్ని వార్తలు వస్తున్నా ఈ సూపర్ స్టార్ మాత్రం వీటిని ఖండించకపోవడంతో అందరికీ అనుమానం వస్తోంది. మరి, నిజంగా రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారా? లేదా? తెలియాలంటే ఆయనే నోరు విప్పాలి!