: సమైక్యానికి మద్దతుగా అంపశయ్యపై నిరసన
అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు తీవ్ర రూపందాలుస్తున్నాయి. సమైక్యాంధ్ర కోసం హామం నిర్వహించారు. ఈ హోమం వద్ద సుమంత్ అనే యువకుడు అంపశయ్యపై పడుకుని నిరసన తెలిపాడు. తెలుగు తల్లిని ముక్కలు చేస్తున్నా సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్టు కూడా లేదని సుమంత్ మండిపడ్డాడు. మహాభారతంలో భీష్ముడు తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించినట్టుగానే, తమ ప్రాంతానికి చెందిన నేతలు చేసిన పాపానికి తాను శిక్ష అనుభవిస్తున్నానని సుమంత్ తెలిపాడు. ఇవాళ 13 జిల్లాలకు చెందిన ప్రజలు ఆవేదనతో రోడ్డుమీదికి వచ్చి ఉద్యమం చేస్తుంటే, ప్రజాప్రతినిధులు మాత్రం పదవులు పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించాడు. జేఎన్టీయూ విద్యార్థులు తెల్ల పంచెలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థులు టవర్ క్లాక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.