: షికాగోలో కాల్పులు.. 13 మంది మృతి
వాషింగ్టన్ నేవీ యార్ట్ ఘటన దుండగల కాల్పుల ఘటన ఇంకా మర్చిపోకముందే మరో ఘటన అమెరికాను కుదిపేసింది. గురువారం అర్థరాత్రి షికాగో నగరంలోని కార్నెల్ స్క్వేర్ పార్కు వద్ద ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. సమాచారం అందగానే స్పందించిన పోలీసులు అంబులెన్స్ లలో క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం స్థానిక రౌడీ ముఠాలకు చెందిన ఓ వ్యక్తి హఠాత్తుగా కాల్పులు ప్రారంభించాడని దీంతో వీధుల్లో ఉన్న యువత పరుగందుకున్నారని తెలిపారు. సడెన్ గా తనకు కూత వేటు దూరంలోనే కాల్పులు ప్రారంభం కావడంతో నేలపై పడుకుని ప్రాణాలు దక్కించుకున్నాని మరో వ్యక్తి తెలిపాడు.